భీముడిని రాజకీయాల్లోకి తీసుకువచ్చిన కేజ్రీవాల్

ABN , First Publish Date - 2020-04-28T16:35:59+05:30 IST

టీవీ మహాభారతంలోని భీముడు పాత్ర పోషించిన ప్రవీణ్ కుమార్ సోబ్తీ నటనతో పాటు రాజకీయాల్లో తన ఉనికి చాటారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్...

భీముడిని రాజకీయాల్లోకి తీసుకువచ్చిన కేజ్రీవాల్

టీవీ మహాభారతంలోని భీముడు పాత్ర పోషించిన ప్రవీణ్ కుమార్ సోబ్తీ నటనతో పాటు రాజకీయాల్లో తన ఉనికి చాటారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చొరవతో ప్రవీణ్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఒక ఇంటర్వ్యూలో ప్రవీణ్ మాట్లాడుతూ  తనకు రాజకీయాల్లో చేరాలనే ఆసక్తి లేదని అన్నారు. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయనను రాజకీయాల్లోకి రావాలని అభ్యర్థించారు. దీనితో ప్రవీణ్ రాజకీయాల్లో చేరారు. తరువాత వజీర్‌పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. కాగా ప్రవీణ్ బీఎస్‌ఎఫ్‌లో పనిచేస్తున్నప్పుడు వచ్చిన ఆఫర్ తో నటనా జీవితాన్ని ప్రారంభించారు. తరువాత మహాభారతం దర్శకుడు బీఆర్ చోప్రాను కలిశారు. బిఆర్ చోప్రా.. ప్రవీణ్ ను భీముడు పాత్రకు ఎన్నుకున్నారు. ప్రవీణ్ సుమారు 50 చిత్రాలలో నటించారు. 

Updated Date - 2020-04-28T16:35:59+05:30 IST