‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ ‘మహా’ద్భుతం: భాస్కరభట్ల

ABN , First Publish Date - 2020-07-31T22:26:59+05:30 IST

‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వెంకటేశ్ మహా రూపొందించిన రెండో చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. సత్యదేవ్, హరిచందన హీరోహీరోయిన్లుగా

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ ‘మహా’ద్భుతం: భాస్కరభట్ల

‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వెంకటేశ్ మహా రూపొందించిన రెండో చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. సత్యదేవ్, హరిచందన హీరోహీరోయిన్లుగా నటించారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా గీత రచయిత భాస్కరభట్ల ఈ సినిమాపై తన అభిప్రాయం ఏమిటో.. ఈ సినిమా ఎలా ఉందో తెలిపారు. 


మనసుపొరల్లో గట్టిగా తిష్టవేసుకుని కూర్చునే సినిమా ఇది. కంగ్రాట్స్ అని తెలుపుతూ..

‘‘ఎటెటో వెళ్లిపోయే జీవితాన్ని

తిరిగి మన ‘చెప్పు’చేతల్లోకి తెచ్చుకోవడమే 

నిజమైన గెలుపంటే!!

ఈ విషయాన్ని 

‘మహా’ద్భుతంగా చెప్పిన చిత్రమే ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’

అని నా అభిప్రాయం. 

అందరూ తమతమ పాత్రల్లోకి అలవోకగా 

పరకాయ ప్రవేశం చేశారు. 

సత్యదేవ్‌కి నిజంగా ఇది మరో మేలిమలుపు చిత్రం..

-భాస్కరభట్ల’’ అని ఓ పోస్టర్‌ను భాస్కరభట్ల తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.Updated Date - 2020-07-31T22:26:59+05:30 IST