రజినీ నిర్ణయంపై భారతీరాజా ప్రశంసలు!

ABN , First Publish Date - 2020-12-30T20:51:47+05:30 IST

ఇప్పట్లో రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించి అభిమానుల ఆశలపై తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ నీళ్లు జల్లారు.

రజినీ నిర్ణయంపై భారతీరాజా ప్రశంసలు!

ఇప్పట్లో రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించి అభిమానుల ఆశలపై తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ నీళ్లు జల్లారు. రజినీ వెనక్కి తగ్గడంపై అభిమానులు మాత్రమే కాదు.. పలువురు సినీ ప్రముఖులు కూడా అసహనం వ్యక్తం చేశారు. అయితే ప్రముఖ దర్శకుడు భారతీరాజా మాత్రం రజినీ నిర్ణయాన్ని సమర్థించారు. 


రజినీకాంత్ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. రాజకీయ ఊబిలోకి రజినీ దిగకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. తన ఆరోగ్య పరిస్థితులననుసరించి రజినీ మంచి నిర్ణయం తీసుకున్నారని, ఆయన అభిమానులు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కర్ణాటకకు చెందిన రజినీకాంత్ తమిళనాడులో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని గతంలో భారతీరాజా విమర్శించిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-12-30T20:51:47+05:30 IST