లాక్‌డౌన్‌పై భరత్‌బాలా లఘుచిత్రం

ABN , First Publish Date - 2020-06-05T18:42:00+05:30 IST

లాక్‌డౌన్‌ గురించి భావితరాలకు తెలియజేసే విధంగా ప్రముఖ దర్శకుడు భరత్‌బాలా ఓ లఘుచిత్రాన్ని రూపొందిస్తున్నారు.

లాక్‌డౌన్‌పై భరత్‌బాలా లఘుచిత్రం

దేశ ప్రజలను కరోనా మహమ్మారి గృహనిర్బంధంలో ఉంచి ముప్పుతిప్పలు పెట్టింది. రెండు నెలలకు పైగా సాగుతున్న లాక్‌డౌన్‌ కారణంగా ప్రజాజీవనం స్తంభించిపోయింది. ప్రజలందరి జీవితాల్లోనూ కరోనా చేదు అనుభవాలనే నింపింది. గృహనిర్బంధంలో గడపటం ప్రజలకు సరికొత్త అనుభవంగా మారింది. ఈ లాక్‌డౌన్‌ గురించి భావితరాలకు తెలియజేసే విధంగా ప్రముఖ దర్శకుడు భరత్‌బాలా ఓ లఘుచిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘మీండుమ్‌ ఎళువోమ్‌’ పేరుతో నాలుగు నిమిషాల వ్యవధితో ఈ లఘుచిత్రాన్ని ఆయన అత్యంత వ్యయ ప్రయాసలకోర్చి నిర్మిస్తున్నారు. ఈ లఘుచిత్రంలో దేశంలోని లాక్‌డౌన్‌ పరిస్థితులను కళ్ళకుకట్టినట్లు ప్రదర్శింపజేయనున్నారు. భరత్‌బాలా ఇదివరకే సంగీత దర్శకుడు ఏఆర్‌ రహ్మాన్‌తో కలిసి ‘వందేమాతరం’ ‘జనగణమన’ పేరుతో దృశ్యరూపకాలను రూపొందించి ప్రేక్షకులను అలరింపజేశారు. తాజాగా రూపొందిస్తున్న ‘మీండుమ్‌ ఎళువోమ్‌’ లఘుచిత్రం కూడా తప్పకుడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని భరత్‌బాలా చెబుతున్నారు.

Updated Date - 2020-06-05T18:42:00+05:30 IST