‘శ్రీకారం’ కోసం భలేగుంది బాల అంటోన్న పెంచల్‌ దాస్‌

ABN , First Publish Date - 2020-11-06T04:17:16+05:30 IST

పెంచల్‌ దాస్‌.. ఈ పేరు గుర్తుందా? నానితో 'దారి చూడు దమ్ము చూడు..' అంటూ హుషారుగా స్టెప్‌ వేయించి, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ 'అరవింద సమేత' చిత్రంలో

‘శ్రీకారం’ కోసం భలేగుంది బాల అంటోన్న పెంచల్‌ దాస్‌

పెంచల్‌ దాస్‌.. ఈ పేరు గుర్తుందా? నానితో 'దారి చూడు దమ్ము చూడు..' అంటూ హుషారుగా స్టెప్‌ వేయించి, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ 'అరవింద సమేత' చిత్రంలో 'కట్టెలే సుట్టాలు.. ' అంటూ కన్నీరు పెట్టించి.. సింగర్‌గా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు పెంచల్‌ దాస్‌. ఇప్పుడాయన శర్వానంద్‌ 'శ్రీకారం' కోసం ఓ పాట పాడారు. భలేగుంది బాల.. అంటూ పెంచల్‌ దాస్‌ పాడిన ఈ పాట టీజర్‌ని చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఆయన వాయిస్‌లో ఈ పాట.. వినసొంపుగా ఉంది. మాస్‌ స్టెప్స్‌తో మిమ్మల్ని అలరించడానికి వస్తున్నాడంటూ.. వదిలిన ఈ పాట టీజర్‌.. సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంది.


ఈ చిత్రం కరోనా లాక్‌డౌన్‌ గ్యాప్‌ తర్వాత ఇటీవలే తిరుపతిలో షూటింగ్‌ స్టార్ట్ చేసుకుని.. అక్కడ షెడ్యూల్‌ కూడా కంప్లీట్‌ చేసుకుంది. శ‌ర్వానంద్‌, ప్రియాంక అరుళ్ మోహ‌న్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని కిశోర్ బి. డైరెక్ట్ చేస్తుండ‌గా, మిక్కీ జె. మేయ‌ర్ సంగీతం అందిస్తున్నారు. పెంచల్‌ దాస్‌ పాడిన ఫుల్‌ లిరికల్‌ వీడియోని నవంబర్‌ 9 సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్‌ ప్రకటించింది.

Updated Date - 2020-11-06T04:17:16+05:30 IST