అవును.. ప్రభాస్ సినిమా చేస్తున్నా: భాగ్యశ్రీ

ABN , First Publish Date - 2020-05-14T19:14:29+05:30 IST

రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

అవును.. ప్రభాస్ సినిమా చేస్తున్నా:  భాగ్యశ్రీ

రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను దక్షిణాది భాషలతోపాటు హిందీలో కూడా భారీగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీని ఈ సినిమాలోకి తీసుకున్నారని వార్తలు వచ్చాయి. 


`మైనే ప్యార్ కియా` సినిమాతో స్టార్‌డమ్ సంపాదించుకున్న భాగ్యశ్రీ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ సినిమాలతో బిజీ కావాలని భాగ్యశ్రీ భావిస్తోంది. తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడిన భాగ్యశ్రీ తన కమ్‌బ్యాక్ గురించి స్పందించింది. `మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటికే కొన్ని స్క్రిప్టులు విన్నాను. రెండు సినిమాలకు ఓకే చెప్పాను. అందులో ప్రభాస్ సినిమా ఒకటి` అని భాగ్యశ్రీ  చెప్పింది. 

Updated Date - 2020-05-14T19:14:29+05:30 IST