అనోన్య దాంపత్యంతో ‘అదైయుం దాండి పునిదమానదు’

ABN , First Publish Date - 2020-02-08T15:37:23+05:30 IST

వేల్స్‌ మూవీస్‌ బ్యానర్‌పై ఆర్‌.వెంకట్రామన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అదైయుం దాండి పునిదమానదు’. వర్ధమానతారలు జకిన్‌, ప్రభుసాస్తా, తిలక్‌, హేమ, గోపిక, ఖుషి,

అనోన్య దాంపత్యంతో ‘అదైయుం దాండి పునిదమానదు’

వేల్స్‌ మూవీస్‌ బ్యానర్‌పై ఆర్‌.వెంకట్రామన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అదైయుం దాండి పునిదమానదు’. వర్ధమానతారలు జకిన్‌, ప్రభుసాస్తా, తిలక్‌, హేమ, గోపిక, ఖుషి, వీన్‌ శెట్టి, వెంకటసుబ్బు, కరాటే రాజా, గంజాకరుప్పు, ముత్తుకాలై, సిజర్‌ మనోహర్‌ తదితరులు నటించారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య దాంపత్యం బాధింపబడితే ఎటువంటి సమస్యలు ఏర్పడతాయన్నది, స్ర్తీలను మోసం చేసి జాలీగా తిరిగే మగాళ్ల కు సంబంధించిన కథతో ఈ చిత్రం తెరకెక్కించారు. షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్టుప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి వేదా సెల్వం సినిమాటోగ్రఫి, వీకే కన్నన్‌ సంగీతం అందించారు.

Updated Date - 2020-02-08T15:37:23+05:30 IST