'బెల్ బాటమ్' టీజర్

ABN , First Publish Date - 2020-10-05T18:39:48+05:30 IST

'బెల్ బాటమ్' టీజర్‌ను అక్షయ్‌ కుమార్‌ తన ఇన్‌స్టా ద్వారా విడుదల చేశారు.

'బెల్ బాటమ్' టీజర్

అక్షయ్ కుమార్‌ స్పీడుకి కరోనా వైరస్‌ తాత్కాలికంగా బ్రేకులేసిందేమో కానీ పూర్తిగా మాత్రం కాదు. కోవిడ్‌ ప్రభావంతో ఆరు నెలల పాటు షూటింగ్స్ ఆగిపోయాయి. షూటింగ్స్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతలు ఇవ్వగానే ముందుగా విదేశాలకు వెళ్లిన హీరో అక్షయ్‌ కుమార్‌.  ఈయన హీరోగా రంజిత్‌ ఎం.తివారీ దర్శకత్వంలో వషు భగ్నానీ, జాకీ భగ్నానీ, దీప్‌శిక్షా దేశ్‌ముఖ్‌, మోనిషా అద్వానీ, మధు బోజ్వానీ, నిఖిల్‌ అద్వానీ నిర్మించిన చిత్రం 'బెల్‌బాటమ్‌'. పాండమిక్‌ సమయంలో చిత్రీకరణను పూర్తి చేసుకున్నఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 2, 2021లో విడుదల చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. వాణీ కపూర్‌, లారాదత్తా, హూమాఖురేషి హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రం 1980 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. ఇందులో అక్షయ్‌ రా ఏజెంట్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా టీజర్‌ను అక్షయ్‌ కుమార్‌ తన ఇన్‌స్టా ద్వారా విడుదల చేశారు. 




Updated Date - 2020-10-05T18:39:48+05:30 IST