వి హేవ్ లెగ్స్ అంటూ బ్యూటీస్ కాళ్ల ప్రదర్శన

ABN , First Publish Date - 2020-09-20T18:25:33+05:30 IST

అందమైన కాళ్లు కనిపిస్తే కళ్లప్పగించేవారెందరో.. అలాంటి కాళ్లపై..

వి హేవ్ లెగ్స్ అంటూ బ్యూటీస్ కాళ్ల ప్రదర్శన

అందమైన కాళ్లు కనిపిస్తే కళ్లప్పగించేవారెందరో.. అలాంటి కాళ్లపై అద్భుతమైన పాటలు, సీన్లు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీలు పోటీ పడి తమ సౌందర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇదంతా స్కిన్ షో ఆరాటం కాదు.. ఇదో పోరాటం. ఇంతకీ కాళ్ల ప్రదర్శన వెనుక ఉన్న వివాదం ఏంటి?


సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న కొత్త క్యాంపైన్.. వి హేవ్ లెగ్స్ అంటూ బ్యూటీస్ కాళ్ల ప్రదర్శన.. ఇదేదో సరదా క్యాంపైన్ కాదు. ఇదో పోరాటం. ఇంతకీ ఈ పోస్టింగ్స్ వెనుక ఉన్న వివాదం ఏంటి? ఈ క్యాంపైన్ ఎక్కడ మొదలైంది? వి హేవ్ లెగ్స్ అంటూ మాలీవుడ్ హీరోయిన్ పోస్టు చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఒక్కోసారి ఒక్కో ట్రెండ్‌లా.. ఇది కూడా ఏదో ఛాలెంజ్ అనుకుంటే పొరపాటే. ఇది ఫన్నీగా కాదు.. పోరాటంలో భాగం. తమిళ్ నటి అనశ్వరా రాజన్ వారం క్రితం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫోటోతో ఈ వివాదం మొదలై సోషల్ మీడియాలో క్యాంపైన్‌కు దారి తీసింది.


అనశ్వరా రాజన్ పొట్టి షార్ట్ ధరించిన ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ విషయాన్ని తప్పుపడుతూ చాలా మంది అసభ్యకరంగా కామెంట్లు చేసి ట్రోల్ చేశారు. దీనిపై మండిపడిన పలువురు తారలు అనశ్వరాకు మద్దతుగా పొట్టి డ్రస్సులు ధరించి కాళ్లు కనిపించేలా ఫోటోలు పోస్టు చేస్తున్నారు. 

Updated Date - 2020-09-20T18:25:33+05:30 IST