తెలుగు, హిందీలో ‘బీ.కామ్ లో ఫిజిక్స్’ చిత్రం
ABN , First Publish Date - 2020-07-21T23:32:45+05:30 IST
‘ఏడుచేపల కథ’ దర్శకుడు శ్యామ్ జే చైతన్య దర్శకత్వంలో వస్తున్న మరో చిత్రానికి ‘బీ.కామ్ లో ఫిజిక్స్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి’, ‘ఏడుచేపల కథ’ వంటి

‘ఏడుచేపల కథ’ దర్శకుడు శ్యామ్ జే చైతన్య దర్శకత్వంలో వస్తున్న మరో చిత్రానికి ‘బీ.కామ్ లో ఫిజిక్స్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి’, ‘ఏడుచేపల కథ’ వంటి విభిన్నమైన టైటిల్స్ పెట్టి యూత్‌ని ఎట్రాక్ట్ చేయడంలో దిట్ట శ్యామ్ జే చైతన్య. తను అనుకున్నది బోల్డ్‌గా ఎంటర్‌టైన్ చేస్తూ చెప్పే దర్శకుల్లో ఈ మధ్య కాలంలో శ్యామ్ పేరు కూడా చేరింది. ఇప్పడు చాలా ఫేమస్ అయిన పదం ‘బీ.కామ్ లో ఫిజిక్స్’ను తన చిత్రానికి టైటిల్‌గా ప్రకటించాడు. 80 శాతం సినిమా పూర్తయ్యింది. ఈ చిత్రాన్ని రెడ్ కార్పెట్ రీల్ ప్రొడక్షన్ బ్యానర్‌లో హిందీ, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు. హిందీలో కూడా టైటిల్‌గా క్రేజీ టైటిల్‌ని ఫిక్స్ అయ్యారట. ఈ వారంలో ఆ టైటిల్‌తో రెండు భాషల మొదటి లుక్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏడుచేపల కథ చిత్రంలో ఎంటర్‌టైన్ చేస్తూ తలసీమియా వ్యాధిపై చర్చించారు. ఇప్పడు కూడా బర్నింగ్ ప్రాబ్లమ్‌ని చాలా బోల్డ్‌గా ఎంటర్‌టైన్ చేయటానికి శ్యామ్ జే చైతన్య సిధ్ధమయినట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రం ఏడుచేపల కథ కంటే మూడింతలు ఎంటర్‌టైన్ చేస్తుందని యూనిట్ చాలా బలంగా చెప్తున్నారు.
అంకిత రాజ్‌పూత్, యశ్వంత్, నగరం సునీల్, మేఘనా చౌదరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్లి, ప్రొడక్షన్ డిజైనర్: స్వాధిన్ శర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పెరుమాళ్ మలినేని, సంగీతం: ఏకె రిషాల్ సాయి, ఎంటి కవిశంకర్; ఎడిటర్: శ్యాంసన్, సౌండ్ డిజైనర్: వనజకేశవ్ స్టూడియో, సౌండ్ మిక్సింగ్: కవి స్టూడియో జెర్మని; కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: శ్యామ్ జే చైతన్య.