సంక్రాంతికి `బంగారు బుల్లోడు`!

ABN , First Publish Date - 2020-12-22T20:25:52+05:30 IST

`అల్లరి` సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన నరేష్ తనదైన టైమింగ్‌తో కామెడీ హీరోగా సత్తా చాటాడు.

సంక్రాంతికి `బంగారు బుల్లోడు`!

`అల్లరి` సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన నరేష్ తనదైన టైమింగ్‌తో కామెడీ హీరోగా సత్తా చాటాడు. వరుసబెట్టి సినిమాలు చేశాడు. అయితే  ఇటీవల హీరోగా సరైన హిట్ లేక వెనకపడిపోయాడు. త్వరలో `బంగారు బుల్లోడు` సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. 


వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రానికి పి.వి.గిరి దర్శకుడు. పూజా ఝవేరి కథానాయికగా నటించింది. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ విడుదలై మంచి ఆదరణ సంపాదించుకుంది. 

Updated Date - 2020-12-22T20:25:52+05:30 IST