రాజకీయాలు వద్దు.. సినిమాలే ముద్దు: బండ్ల గణేష్

ABN , First Publish Date - 2020-05-11T21:27:43+05:30 IST

నాకు కిక్ ఇచ్చేది రాజకీయాలు కాదు.. సినిమాలే అని తెలుసుకున్నాను. అందుకే ఇకపై సినిమాలతోనే కిక్ పొందాలని డిసైడ్ అయ్యానని అన్నారు నిర్మాత బండ్ల గణేష్. ఆయన

రాజకీయాలు వద్దు.. సినిమాలే ముద్దు: బండ్ల గణేష్

నాకు కిక్ ఇచ్చేది రాజకీయాలు కాదు.. సినిమాలే అని తెలుసుకున్నాను. అందుకే ఇకపై సినిమాలతోనే కిక్ పొందాలని డిసైడ్ అయ్యానని అన్నారు నిర్మాత బండ్ల గణేష్. ఆయన నిర్మించిన ‘గబ్బర్‌సింగ్’ చిత్రం నేటితో (మే 11) 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చెలరేగిపోతున్నారు. 8ఇయర్స్‌ఆఫ్‌గబ్బర్‌సింగ్‌హిస్టీరియా అనే ట్యాగ్‌తో ఇప్పటి వరకు ఇతర హీరోలకు ఉన్న ఇలాంటి రికార్డులన్నింటికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా తమ హీరోకి ఇలాంటి గొప్ప హిట్ చిత్రం ఇచ్చిన బండ్ల గణేష్‌ని కూడా వారు ట్యాగ్ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఉత్సాహం పొంగుకొచ్చిన బండ్ల గణేష్ రాత్రి నుంచి ఈ హిస్టీరియాలో మునిగిపోయారు. ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాకే అతుక్కుపోయిన ఆయన రీట్వీట్స్ చేస్తూ.. మధ్యమధ్యలో గబ్బర్‌సింగ్ చిత్రం, పవన్ కల్యాణ్ అంటే తనకు ఎంత పిచ్చో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన రాజకీయాలు వద్దు.. సినిమానే ముద్దు అంటూ ట్వీట్ చేసి.. ఇక రాజకీయాలకు దూరం అని చెప్పకనే చెప్పారు.


‘‘జీవితంలో కిక్ కావాలంటే ఒక్క సినిమానే అని నేను డిసైడ్ అయ్యా. నాకు సినిమానే జీవితం సినిమాయే ప్రాణ౦. నా 15 సంవత్సరాల వయస్సులో సినిమా ఇండస్ట్రీకి వచ్చా. నాకు రాజకీయాలు వద్దు సినిమాయే ముద్దు. నావల్ల నా మాటలు వల్ల బాధపడ్డ ప్రతి ఒక్కరినీ క్షమించమని కోరుకుంటున్నాను..’’ అని బండ్ల గణేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. Updated Date - 2020-05-11T21:27:43+05:30 IST