మరోసారి దండం పెట్టిన బండ్ల గణేష్‌

ABN , First Publish Date - 2020-12-01T23:29:19+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి బండ్ల గణేష్‌పై ఏదో ఒక చోట వార్తలు రావడం.. ఆ వార్తలకు ఆయన రియాక్ట్ అవ్వడం వంటివి చూస్తూనే ఉన్నాం. ''నేను రాజకీయాలకు

మరోసారి దండం పెట్టిన బండ్ల గణేష్‌

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి బండ్ల గణేష్‌పై ఏదో ఒక చోట వార్తలు రావడం.. ఆ వార్తలకు ఆయన రియాక్ట్ అవ్వడం వంటివి చూస్తూనే ఉన్నాం. ''నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. దయచేసి నన్ను రాజకీయాలలోకి లాగకండి. చేతులు జోడించి దండం పెడుతున్నా.. నాకు ఏ రాజకీయ పార్టీలతో, ఏ రాజకీయాలతో సంబంధం లేదు.. నేను రాజకీయాలకు దూరం.." అని క్లారిటీ ఇస్తూ వస్తున్న బండ్ల గణేష్‌.. ట్విట్టర్‌ వేదికగా మరోసారి దండం పెట్టి వేడుకున్నారు. అయితే ఈసారి రాజకీయ విమర్శలపై కాదు.. హైదరాబాద్‌ ఓటర్ల కోసం ఆయన దండం పెట్టారు. దండం పెడుతున్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయండి.. లేదంటే అడిగే హక్కు కోల్పోతారు అని బండ్ల గణేష్‌ ఓటర్లను వేడుకున్నారు.

 

''దయచేసి ప్రతి ఒక్కరూ వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోండి ఇది మీ కర్తవ్యం. హైదరాబాదులో ఓటు హక్కు ఉండీ.. ఓటు వేయకుండా ఇంట్లో కూర్చున్న అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా .. ఓటు వేయండి. వేయకుంటే మీరు అడిగే  హక్కును కోల్పోతారు..'' అని బండ్ల గణేష్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.





Updated Date - 2020-12-01T23:29:19+05:30 IST