గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న బండ్ల గణేష్

ABN , First Publish Date - 2020-07-27T21:56:02+05:30 IST

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఆయన పిలుపు మేరకు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న బండ్ల గణేష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఆయన పిలుపు మేరకు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి మొక్కలు నాటడమే కాకుండా బాధ్యత తీసుకోని ఇతరుల చేత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పూర్తి చేయించడం జరుగుతుంది. తాజాగా ఈ ఛాలెంజ్‌లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌లు పాల్గొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు జర్నలిస్ట్ మూర్తి ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో బండ్ల గణేష్ పాల్గొని మొక్కలు నాటారు. 


ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి గొప్ప కార్యక్రమంలో నన్నూ భాగం చేసి, ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళుతూ.. అందరిలో స్ఫూర్తి నింపుతున్న సంతోష్ కుమార్‌గారికి కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరికీ ప్రకృతి యొక్క గొప్పతనం ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. అందుకే అందరూ మొక్కలు నాటి ప్రకృతిని పచ్చదనంతో నింపుదాం. నేను కూడా ఈ ఛాలెంజ్‌కు డైరెక్టర్ శ్రీను వైట్ల, డైరెక్టర్ కృష్ణవంశీ, డైరెక్టర్ పరశురామ్‌లను నామినేట్ చేస్తున్నాను..’’ అని తెలిపారు.Updated Date - 2020-07-27T21:56:02+05:30 IST