‘గ‌బ్బ‌ర్ సింగ్’ ఎప్ప‌టికీ చ‌రిత్రే: బండ్ల‌గ‌ణేశ్‌

ABN , First Publish Date - 2020-05-11T17:39:12+05:30 IST

దాదాపు ప‌దేళ్లుగా హిట్ లేని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు గ‌బ్బ‌ర్‌సింగ్ తిరుగులేని విజ‌యాన్ని అందించింది. ప‌వ‌న్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ద‌బాంగ్ చిత్రాన్ని డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ అద్భుతంగా తెర‌కెక్కించారు.

‘గ‌బ్బ‌ర్ సింగ్’ ఎప్ప‌టికీ చ‌రిత్రే:  బండ్ల‌గ‌ణేశ్‌

నేటి త‌రం అగ్ర క‌థానాయ‌కుల్లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఉన్న ఇమేజ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్ప‌న‌వ‌సరం లేదు. జ‌యాప‌జ‌యాల‌కు సంబంధం లేని ఫ్యాన్ బేస్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సొంతం. ఆయ‌న సాధించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ హ‌ట్స్‌లో గ‌బ్బ‌ర్‌సింగ్ చిత్రానికి ఓ ప్ర‌త్యేక స్థానం ఉంది. దాదాపు ప‌దేళ్లుగా హిట్ లేని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు గ‌బ్బ‌ర్‌సింగ్ తిరుగులేని విజ‌యాన్ని అందించింది. ప‌వ‌న్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ద‌బాంగ్ చిత్రాన్ని డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ అద్భుతంగా తెర‌కెక్కించారు. ప‌వ‌న్ స్టైల్, డాన్సులు, ఫైట్స్‌, డైలాగ్స్ అన్నీ ఆయ‌న అభిమానులను, ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి. ఈ సినిమా విడుద‌లై నేటికి 8 ఏళ్లు అవుతుంది. ఈ హ్యాష్ ట్యాగ్ నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమా గురించి బండ్ల‌గ‌ణేశ్ ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. ‘‘అందరూ పుట్టినరోజు నాడు పెళ్లి రోజు నాడు హోమం చేసుకుంటారు నేను నా కుటుంబ సభ్యులతో గబ్బర్ సింగ్ విడుదల రోజు గణపతి హోమం చేశాను. గబ్బర్ సింగ్ ఇది ఇది నాకు నా దైవ సమానులైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన భిక్ష ఎప్పటికీ నేను కృతజ్ఞుణ్ణి. ఈ రోజుల్లో నిన్న అని రోజున పొందిన సహాయాన్ని మర్చిపోయి మళ్లీ ఎదురు తిరిగి వారిని ప్రశ్నిస్తారు కానీ నేను మాత్రం ఈ జన్మంతా ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను.చరిత్రలో కొన్ని చిరస్థాయిగా ఉండిపోతాయి తెలుగు చలనచిత్ర చరిత్రలో గబ్బర్ సింగ్ ఎప్పటికీ చరిత్ర’’ అని ట్వీట్స్ చేశారు. 

Updated Date - 2020-05-11T17:39:12+05:30 IST