బాలు పాట ఒక బ్రాండ్‌

ABN , First Publish Date - 2020-08-25T05:27:52+05:30 IST

‘‘దక్షిణ భారత సినిమా పాటలకు ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం పేరు ఒక బ్రాండ్‌ అనడం అతిశయోక్తి కాదు. డ్యాన్స్‌ రాని వారితో స్టెప్స్‌ వేయించే శక్తి.. సంగీతం గురించి తెలియని వారితో...

బాలు పాట ఒక బ్రాండ్‌

‘‘దక్షిణ భారత సినిమా  పాటలకు ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం పేరు ఒక బ్రాండ్‌ అనడం అతిశయోక్తి కాదు. డ్యాన్స్‌ రాని వారితో స్టెప్స్‌ వేయించే శక్తి.. సంగీతం గురించి తెలియని వారితో  హమ్మింగ్‌ చేయించే పవర్‌ బాలు పాటకు ఉంది. 54 సంవత్సరాల కళా ప్రస్థానంలో సాధించుకున్న అశేషమైన అభిమానుల ప్రేమ, పూజలతో కచ్చితంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన తిరిగి వస్తారని విశ్వసిస్తున్నాను’’ అని విజయశాంతి అన్నారు. గాన గంధర్వుడు ఎస్‌.పి. బాలు కరోనాతో పోరాడుతూ చెన్నైలోని ఓ ప్రవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే! ఆయన త్వరగా కోలుకోవాలని విజయశాంతి ఆకాంక్షించారు. ఈ మేరకు ఆమె ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘‘రెండు తరాల జీవితాలు బాలూ గారి పాటతో పెనవేసుకుని ఉంటాయి. ఒక తరం పూర్తిగా బాలూగారి పాటలు వింటూ పెరిగింది. ఎస్పీబీ గారు తన గానంతో అలరించడమే కాకుండా... టీవీ షోల ద్వారా ఎందరో గాయనీగాయకుల్ని ప్రోత్సహించి, వాళ్ళు కూడా సినీ రంగంలో నిలదొక్కుకునేలా ఊతమిచ్చారు. పాటే కాదు, భావి తరాలకు వినయం, విధేయత లాంటి సుగుణాలు కూడా తెలిేసలా తన ప్రవర్తన ద్వారా నేర్పించారు. తెలుగువారే కాకుండా తమిళ, కన్నడ. మలయాళం.. అలాగే ఉత్తరాది రాష్ర్టాల అభిమానులు కూడా బాలు రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఎంతోమంది సంకల్పం ఇది. కచ్చితంగా బాలుగారు మనకోసం మళ్లీ పాడేలా చేస్తుంది’’ అని విజయశాంతి పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-25T05:27:52+05:30 IST