‘బల్లేగా తగిలావే బంగారం’

ABN , First Publish Date - 2020-12-15T10:31:03+05:30 IST

రవితేజ, గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘క్రాక్‌’ షూటింగ్‌ పాటలతో సహా పూర్తయింది. ఇటీవల రవితేజ, శ్రుతి హాసన్‌లపై రాజు సుందరం...

‘బల్లేగా తగిలావే బంగారం’

రవితేజ, గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘క్రాక్‌’ షూటింగ్‌ పాటలతో సహా పూర్తయింది. ఇటీవల రవితేజ, శ్రుతి హాసన్‌లపై రాజు సుందరం నేతృత్వంలో ‘బల్లేగా తగిలావే బంగారం’ పాటను చిత్రీకరించారు. ఈ సాంగ్‌ లిరికల్‌ వీడియోను సోమవారం చిత్ర బృందం విడుదల చేసింది.  శ్రుతీహాసన్‌ అందాలను పొగుడుతూ, ఆమెను ఆటపట్టించే పాట ఇది. ఎస్‌.ఎస్‌ తమన్‌ ఇచ్చిన క్యాచీ ట్యూన్స్‌కు రామజోగయ్య శాస్ర్తి హుషారైన పాట అందించారు. అంతే ఎనర్జీతో అనిరుధ్‌ రవిచందర్‌ ఆలపించారు. ఆయన వాయిస్‌ ఈ పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చిందని, గతంలో విడుదల చేసిన ‘భూమ్‌ బద్దల్‌’ పాటను మించి ఈ పాట హిట్‌ అయిందని చిత్ర బృందం చెబుతోంది. తెలుగు రాష్ర్టాల్లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సరస్వతి ఫిలిమ్స్‌ డివిజన్‌ బ్యానర్‌పై బి. మధు నిర్మిస్తున్నారు. సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పవర్‌ఫుల్‌ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Updated Date - 2020-12-15T10:31:03+05:30 IST

Read more