కూరగాయలు అమ్ముతున్న అసిస్టెంట్‌ డైరెక్టర్‌

ABN , First Publish Date - 2020-09-29T19:41:02+05:30 IST

'బాలికావధు' వంటి పాపులర్‌ సీరియల్‌కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన రామ్‌ వృక్షగౌర్‌ ఈ కరోనా వల్ల బాధితుడయ్యారు.

కూరగాయలు అమ్ముతున్న అసిస్టెంట్‌ డైరెక్టర్‌

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ చాలా రంగాలపై పెద్ద ప్రభావాన్నే చూపిస్తుంది. సినీ రంగం విషయానికి వస్తే.. షూటింగ్స్ ఆగిపోవడంతో సినిమానే నమ్ముకున్న చాలా మంది, కుటుంబ నిర్వహణకు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పూట గడవటం కోసం ఏదో ఒక పని చేయాలని సినీ రంగాన్ని వదలేసినవాళ్లు కూడా ఉన్నారు. ఆ కోవలో ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ చేరారు. 'బాలికావధు' వంటి పాపులర్‌ సీరియల్‌కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన రామ్‌ వృక్షగౌర్‌ ఈ కరోనా వల్ల బాధితుడయ్యారు. పనేదీ లేకపోవడంతో కుటుంబ నిర్వహణ కోసం కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. సినిమా చేయాల్సిన తాను తన స్వగ్రామం అజంఘడ్‌ వచ్చానని, లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వెళ్లే అవకాశం లేకుండా పోయిందని రామ్‌ వృక్షగౌర్‌ అన్నారు. తాను సినిమా చేయాల్సిన నిర్మాత సినిమా ఆగిపోయిందంటూ ఫోన్‌ చేసి చెప్పారని, దాంతో ఏం చేయాలో తెలియలేదని ఆయన అన్నారు. అదే సమయంలో నాన్న చేసే కూరగాయల వ్యాపారాన్ని చేయాలనకున్నానని రామ్‌ వృక్షగౌర్‌ తెలిపారు. తాను చేస్తున్న పని గురించి తాను బాధపడటం లేదని చెబుతున్న రామ్‌ వృక్షగౌర్‌ గురించిన వార్తలు నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నాయి. 


Updated Date - 2020-09-29T19:41:02+05:30 IST