లైవ్‌లోకి బాలయ్య!

ABN , First Publish Date - 2020-06-10T18:09:18+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది నటరత్న నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఇంటికే పరిమితమయ్యాయి.

లైవ్‌లోకి బాలయ్య!

కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది నటరత్న నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఇంటికే పరిమితమయ్యాయి. అభిమానులను కలవడం కుదరలేదు. దాంతో బాలయ్యే అభిమానులకు అందుబాటులోకి రాబోతున్నారు. 


ఈ రోజు (బుధవారం) సాయంత్రం 4:30 గంటలకు బాలకృష్ణ ఫేస్‌బుక్ ‌లైవ్‌లోకి రాబోతున్నారు. `ప్రతి సంవత్సరం మీరు నా కోసం వస్తారు. ఈ ఏడాది  మీ కోసం నేనే వస్తున్నా` అంటూ బాలయ్య పేర్కొన్నారు. బాలయ్య సోషల్ మీడియా ద్వారా లైవ్‌లోకి రావడం ఇదే తొలిసారి కానుంది. అభిమానులు అడిగే ఆసక్తికర ప్రశ్నలకు బాలయ్య  సమాధానాలు ఇవ్వబోతున్నారు. 

Updated Date - 2020-06-10T18:09:18+05:30 IST