సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘నర్తనశాల’కు ఆ తపనే కారణం: బాలయ్య

ABN, First Publish Date - 2020-10-22T22:39:45+05:30

సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలలో తండ్రికి ధీటైన తనయుడిగా, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటవారసుడిగా ప్రేక్షకుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలలో తండ్రికి ధీటైన తనయుడిగా, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటవారసుడిగా ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకుంటున్న నటసింహ నందమూరి బాలకృష్ణ స్వీయదర్శకత్వంలో అపురూప చిత్రం నర్తనశాల ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించిన దాదాపు 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ప్రేక్షకులు, అభిమానులు వీక్షించడానికి వీలుగా ఈ విజయదశమి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రం ఎన్ బి కె థియేటర్‌లో శ్రేయాస్ ఈటి ద్వారా అక్టోబర్ 24న  విడుదలవుతుంది. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్‌కి ఉపయోగించడానికి నందమూరి బాలకృష్ణ సంకల్పించారు. తాజాగా ఆయన ఈ 'నర్తనశాల'కు సంబంధించిన విశేషాలను మీడియాకు తెలియజేశారు.



సౌందర్య, శ్రీహరి వంటి దివికేగిన తారలను మళ్లీ భువికి రప్పించడం ఈ చిత్రంతోనే సాధ్యమైందని, ఈ సినిమా రూపొందించే సమయంలో ప్రతి ఆర్టిస్ట్ దగ్గర నుంచి 10 రోజులు మాత్రమే డేట్స్‌ తీసుకున్నానని, కానీ 5 రోజులలోనే షూట్‌ చేసేశానని బాలయ్య తెలిపారు. నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది కళాకారులకు గౌరవం ఇవ్వడం, పని చేస్తున్నప్పుడు అందరూ అందులో ఇన్‌వాల్వ్ అయ్యేలా చూసుకోవడం వంటి వన్నీ నాన్నగారి స్కూల్‌ నుంచి నేర్చుకున్నానని బాలయ్య అన్నారు. ఇంకా ఈ వీడియోలో చిత్రానికి సంబంధించిన అనేక విశేషాలను బాలయ్య తెలిపారు. అవేంటో తెలియాలంటే పూర్తిగా పై వీడియో చూడాల్సిందే.


 'నర్తనశాల' ట్రైలర్:



Updated Date - 2020-10-22T22:39:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!