జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు: బాలయ్య

ABN , First Publish Date - 2020-06-12T03:40:34+05:30 IST

తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ నందమూరి నటసింహ బాలకృష్ణ కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. ఈ సందర్భంగా

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు: బాలయ్య

తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ నందమూరి నటసింహ బాలకృష్ణ కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అధికారికంగా ఓ లెటర్‌ను విడుదల చేశారు. 


‘‘వివిధ మాధ్యమాల ద్వారా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మా పరిశ్రమ ప్రముఖులకు, దర్శకనిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు, కళాకారులకు, హితులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, మరియు నిస్వార్థంగా, ఎల్లవేళలా నా వెన్నంటి నడుస్తూ నా పుట్టినరోజుని ఒక పండుగలా జరుపుకునే నా అభిమానులకు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ సిబ్బందికి, ఆల్ ఇండియా ఎన్‌బి‌కె ఫ్యాన్స్ కన్వీనర్స్‌కి, ఎన్‌బికె హెల్పింగ్ హ్యాండ్స్ వారికి, మనబాలయ్య. కామ్ నిర్వాహకులకు మరియు ఎన్ఆర్ఐ అభిమానులకు పేరుపేరునా నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను.. 

మీ 

బాలకృష్ణ’’

అని ఈ లెటర్‌లో బాలయ్య పేర్కొన్నారు. Updated Date - 2020-06-12T03:40:34+05:30 IST