రక్తదానం చెయ్యండి.. ఇతరులను కాపాడండి: బాలకృష్ణ

ABN , First Publish Date - 2020-10-01T03:26:12+05:30 IST

వైద్యరంగం ఎంతగా అభివృద్ధి చెందినా కృత్రిమంగా రక్తం తయారు చెయ్యడం సాధ్యం కాదు

రక్తదానం చెయ్యండి.. ఇతరులను కాపాడండి: బాలకృష్ణ

వైద్యరంగం ఎంతగా అభివృద్ధి చెందినా కృత్రిమంగా రక్తం తయారు చెయ్యడం సాధ్యం కాదు కాబట్టి అందరూ రక్తదానం చేయాలని నటరత్న నందమూరి బాలకృష్ణ సూచించారు. తలసీమియా వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు అందరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. 


అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా, తలసేమియా బాధితుల కోసం తెలంగాణా తెలుగు యువత, ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అభిమానులు, కార్యకర్తలు, ఆరోగ్యం గా ఉన్న ప్రతి ఒక్కరూ రక్త దానం చేసి, ఆపదలో ఉన్న ప్రాణాలను కాపాడాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు.Updated Date - 2020-10-01T03:26:12+05:30 IST