'నర్తనశాల' సినిమా చేయడానికి కారణమదే: నందమూరి బాలకృష్ణ

ABN , First Publish Date - 2020-10-25T21:09:12+05:30 IST

తండ్రి బాటలో పయనిస్తూ సాంఘిక, జానపద, చారిత్రక, పౌరాణిక చిత్రాలతో అలరిస్తున్న నటుడు నందమూరి బాలకృష్ణ. ఆయన స్వీయ దర్శక నిర్మాణంలో పౌరాణిక చిత్రం 'నర్తనశాల'ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

'నర్తనశాల' సినిమా చేయడానికి కారణమదే: నందమూరి బాలకృష్ణ

తండ్రి బాటలో పయనిస్తూ సాంఘిక, జానపద, చారిత్రక, పౌరాణిక చిత్రాలతో అలరిస్తున్న నటుడు నందమూరి బాలకృష్ణ. ఆయన స్వీయ దర్శక నిర్మాణంలో పౌరాణిక చిత్రం 'నర్తనశాల'ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించిన దాదాపు 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను ప్రేక్షకులు, అభిమానులు వీక్షించడానికి వీలుగా ఈ విజయదశమి సందర్భంగా అక్టోబర్‌ 24న విడుదల చేశారు. దసరా సందర్భంగా ఆయన ఏబీఎన్‌ ఛానెల్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతూ "నర్తనశాల సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. దీన్ని పూర్తిస్థాయి సినిమాగా తెరకెక్కించాలనిపిస్తుంది. నటన అంటే పాత్ర లోతుల్లోకి వెళ్లి, పాత్రను పరకాయ ప్రవేశం చేసి చేయాలి. అర్జునుడు, కృష్ణుడు, బృహన్నల, కీచకుడుగా ఈ సినిమాలో నటించాలని అనుకున్నాను. ముఖ్యంగా కీచకుడి పాత్ర కోసం ప్రత్యేకంగా డైలాగ్స్‌  కూడా రాసుకున్నాను. నాన్నగారు చేసిన నర్తనశాలలో కీచకుడిగా ఎస్‌.వి.రంగారావుగారు ఎంత గొప్పగా నటించారో నేను చెప్పనక్కర్లేదు. నాన్నగారు నర్తనశాలకు ఇప్పటికీ ఆదరణ తగ్గదు అందుకే నేను ఆ సినిమా చేయాలనుకున్నాను. మహాభారతంలోని పర్వాలలలో విరాటపర్వంలో నవ రసాలుంటాయి" అని అంటున్న నట సింహ నందమూరి బాలకృష్ణ ఇంటర్వ్యూ మీ కోసం....




Updated Date - 2020-10-25T21:09:12+05:30 IST

Read more