సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ప్రేమ, త్యాగాలకు ప్రతీక రంజాన్: నందమూరి బాలకృష్ణ

ABN, First Publish Date - 2020-05-25T18:22:45+05:30

హిందూపురం ఎమ్మెల్యే, హీరో నంద‌మూరి బాల‌కృష్ణ ముస్లిం సోద‌రుల‌కు వీడియో ద్వారా రంజాన్ శుభాకాంక్ష‌ల‌ను తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్ర‌పంచ వ్యాప్తంగా ముస్లిం సోద‌రులు నేడు(మే 25) రంజాన్ వేడుకుల‌ను జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా  సినీ సెల‌బ్రిటీలంద‌రూ ముస్లిం సోద‌రుల‌కు రంజాన్ శుభాకాంక్ష‌ల‌ను తెలియజేశారు. ఈ క్ర‌మంలో హిందూపురం ఎమ్మెల్యే, హీరో నంద‌మూరి బాల‌కృష్ణ ముస్లిం సోద‌రుల‌కు వీడియో ద్వారా రంజాన్ శుభాకాంక్ష‌ల‌ను తెలిపారు. ‘‘ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రేమ త్యాగాలకు ప్రతీక రంజాన్. లాక్‌డౌన్‌లో కూడా మనో ధైర్యంతో ఉంటూ కఠోర ఉపవాస దీక్షలు చేశారు. ప్రార్థనలు ఫలించి కరోనా మహమ్మారి త్వరలోనే అంతం కావాలని కోరుకుంటున్నా. అంతా తమ తమ ఇళ్లలోనే ఉండి రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలి. సమస్త మానవాళి బాగుండేలా ఈద్ అందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని వేడుకుంటున్నా’’ అన్నారు. 




Updated Date - 2020-05-25T18:22:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!