ప్రేమ, త్యాగాలకు ప్రతీక రంజాన్: నందమూరి బాలకృష్ణ
ABN , First Publish Date - 2020-05-25T18:22:45+05:30 IST
హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ ముస్లిం సోదరులకు వీడియో ద్వారా రంజాన్ శుభాకాంక్షలను తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సోదరులు నేడు(మే 25) రంజాన్ వేడుకులను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలందరూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ ముస్లిం సోదరులకు వీడియో ద్వారా రంజాన్ శుభాకాంక్షలను తెలిపారు. ‘‘ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రేమ త్యాగాలకు ప్రతీక రంజాన్. లాక్‌డౌన్‌లో కూడా మనో ధైర్యంతో ఉంటూ కఠోర ఉపవాస దీక్షలు చేశారు. ప్రార్థనలు ఫలించి కరోనా మహమ్మారి త్వరలోనే అంతం కావాలని కోరుకుంటున్నా. అంతా తమ తమ ఇళ్లలోనే ఉండి రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలి. సమస్త మానవాళి బాగుండేలా ఈద్ అందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని వేడుకుంటున్నా’’ అన్నారు.
’