'బ్యాక్‌డోర్‌' సెకండ్‌ షెడ్యూల్‌ పూర్తి

ABN , First Publish Date - 2020-12-01T18:03:02+05:30 IST

నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ తెరకెక్కిస్తున్న విభిన్న కథాచిత్రం 'బ్యాక్ డోర్' రెండో షెడ్యూల్ పూర్తయ్యింది.

'బ్యాక్‌డోర్‌' సెకండ్‌ షెడ్యూల్‌ పూర్తి

నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ  తెరకెక్కిస్తున్న విభిన్న కథాచిత్రం 'బ్యాక్ డోర్' రెండో షెడ్యూల్ పూర్తయ్యింది. ప్రముఖ కథానాయకి పూర్ణ ఇందులో ప్రధాన పాత్రధారి. ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువ కథానాయకుడు తేజ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం పతాక సన్నివేశాలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు కర్రి బాలాజీ మాట్లాడుతూ "పూర్ణ ఎంత మంచి పెర్ఫార్మరో అందరికీ తెలిసిందే. తనకు చాలా మంచి పేరొస్తుంది. 'బ్యాక్ డోర్' ఎంట్రీ వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం మా అందరికీ మంచి పేరు తెస్తుంది. మా నిర్మాత శ్రీనివాస్ రెడ్డిగారు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని అత్యున్నత ప్రమాణాలతో నిర్మిస్తున్నారు" అని అన్నారు.నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ "మా దర్శకుడు బాలాజీ శర వేగంతో, కంప్లీట్ క్లారిటీతో షూటింగ్ చేస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల నుంచి మంచి అవుట్ పుట్ రాబట్టుకుంటున్నారు" అని వివరించారు. హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ "ఈ చిత్రంలో నా పాత్ర పేరు అంజలి. వయసులో నాకంటే చిన్న వయసున్న అబ్బాయి ప్రేమ కోసం పరితపించే పాత్ర చేస్తున్నాను. చాలా ఛాలెంజింగ్ రోల్. బాలాజీ గారు నా పాత్రతోపాటు సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు" అని అన్నారు.


Updated Date - 2020-12-01T18:03:02+05:30 IST

Read more