అమితాబ్ బాగానే ఉన్నారు: మ‌ంత్రి రాజేష్ తోపె

ABN , First Publish Date - 2020-07-12T15:36:47+05:30 IST

బాలీవుడ్ దిగ్గ‌జం అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడి, ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. బిగ్ బి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉందని, అవ‌స‌ర‌మైన‌ చికిత్స అందిస్తున్నామ‌ని వైద్యులు తెలిపారు. ఇదిలావుండ‌గా...

అమితాబ్ బాగానే ఉన్నారు: మ‌ంత్రి రాజేష్ తోపె

ముంబై: ‌బాలీవుడ్ దిగ్గ‌జం అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడి, ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. బిగ్ బి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉందని, అవ‌స‌ర‌మైన‌ చికిత్స అందిస్తున్నామ‌ని వైద్యులు తెలిపారు. ఇదిలావుండ‌గా అమితాబ్ బచ్చన్ బాగున్నారని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే తెలిపారు. అమితాబ్ క‌రోనా సంబంధిత తేలికపాటి లక్షణాలతో బాధ‌ప‌డుతున్నార‌న్నారు. కాగా కరోనావైరస్‌కు అధికంగా ప్రభావితమైన నగరాల్లో ముంబై ఒక‌టి. ఈ మ‌హాన‌గ‌రంలో క‌రోనా కేసుల సంఖ్య 9,1745గా ఉంది. అమితాబ్ బచ్చన్ కరోనా బారిన ప‌డ్డార‌ని తెలియ‌గానే, బాలీవుడ్ ప్ర‌ముఖులు బిగ్ బీ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. 

Updated Date - 2020-07-12T15:36:47+05:30 IST