జనవరిలో కొత్త సినిమా స్టార్ట్‌ చేస్తున్న అక్షయ్‌

ABN , First Publish Date - 2020-11-04T01:20:47+05:30 IST

శరవేగంగా సినిమాలను పూర్తి చేస్తూ ఏడాదిలో మూడు నాలుగు సినిమాలు చేస్తున్న బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ స్పీడుకి కోవిడ్‌ బ్రేకులేసింది.

జనవరిలో కొత్త సినిమా స్టార్ట్‌ చేస్తున్న అక్షయ్‌

శరవేగంగా సినిమాలను పూర్తి చేస్తూ ఏడాదిలో మూడు నాలుగు సినిమాలు చేస్తున్న బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ స్పీడుకి కోవిడ్‌ బ్రేకులేసింది. ఆయనకే సినీ ఇండస్ట్రీ అంతా ఆరేడు నెలల పాటు షూటింగ్‌లేకుండా ఆగింది. ఇప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ అందరూ సినిమాలను ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో అక్షయ్‌ కుమార్‌ రెట్టించిన స్పీడుతో సినిమాలను పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే బెల్‌బాటమ్‌ సినిమాను పూర్తి చేసేసిన అక్షయ్‌, ఇప్పుడు పృథ్వీరాజ్‌ సినిమాను పూర్తి చేసేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే తదుపరి సినిమాగా బచ్చన్‌పాండేను స్టార్ట్‌ చేయబోతున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో సినిమాను స్టార్ట్‌ చేసి మార్చికంతా పూర్తి చేసేలా ప్లాన్స్‌ జరిగిపోయాయి. వచ్చే ఏడాది చివరలో ఈ సినిమాను విడుదల చేస్తారట. ఈ చిత్రంలో కృతిసనన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఫర్మాద్‌ సాంజీ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. 


Updated Date - 2020-11-04T01:20:47+05:30 IST

Read more