రాజ్‌తరుణ్.. ఐ లవ్ యూ: అవిక

ABN , First Publish Date - 2020-12-26T15:41:36+05:30 IST

`ఉయ్యాలా.. జంపాలా..` సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు రాజ్‌తరుణ్, అవికా గోర్.

రాజ్‌తరుణ్.. ఐ లవ్ యూ: అవిక

`ఉయ్యాలా.. జంపాలా..` సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు రాజ్‌తరుణ్, అవికా గోర్. ఆ తర్వాత `సినిమా చూపిస్తా మామ` సినిమాలో కలిసి నటించి మరో విజయం అందుకున్నారు. తాజాగా రాజ్‌తరుణ్ తన కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు. కరోనా నిబంధనల కారణంగా తక్కువ మంది అతిథులు హాజరైన ఈ వేడుకకు అవికా గోర్ వచ్చింది. 


కొత్త ఇంట్లో తల్లిదండ్రులు, అవికతో దిగిన ఫొటోను షేర్ చేసిన రాజ్‌తరుణ్.. `నా మొదటి చిత్రం నుంచి నా కొత్తింటి గృహ ప్రవేశం వరకు నాతోనే ఉన్నందుకు ధన్యవాదాలు అవిక` అని కామెంట్ చేశాడు. ఈ ఫొటోపై అవిక స్పందించింది. `నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది రాజ్‌తరుణ్. నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను. అమి తుమాకో భాలో బాషి (నేను నిన్ను ప్రేమిస్తున్నా)` అంటూ కామెంట్ చేసింది. Updated Date - 2020-12-26T15:41:36+05:30 IST