అద్దంలో చూసుకుని ఏడ్చాను: అవిక!

ABN , First Publish Date - 2020-10-30T15:11:45+05:30 IST

`చిన్నారి పెళ్లి కూతురి`గా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న అవికా గోర్.. `ఉయ్యాలా జంపాలా` సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసింది.

అద్దంలో చూసుకుని ఏడ్చాను: అవిక!

`చిన్నారి పెళ్లి కూతురి`గా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న అవికా గోర్.. `ఉయ్యాలా జంపాలా` సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. `రాజు గారి గది-3` తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకుంది. అయితే ఈ గ్యాప్‌లో అవిక సరికొత్తగా తయారైంది. బొద్దుగా ఉండే అవిక.. సన్నగా నాజూగ్గా మారిపోయింది. తాజాగా తన స్మార్ట్ లుక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన అవిక.. తను సన్నబడడం వెనకున్న కారణాన్ని వివరించింది. 


`గతేడాది ఒక రోజు రాత్రి అద్దంలో నన్ను నేను చూసుకుని ఏడ్చాను. ఆ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను. నా శరీరం నాకు అస్సలు నచ్చలేదు. నేను నా శరీరానికి తగినంత గౌరవం ఇవ్వలేదు. దాని ఫలితమే నా ఊబకాయం. శరీరాకృతి విషయంలో ఎన్నోసార్లు బాధపడ్డాను. ఇలాంటి ఎన్నో ఆలోచనలు నాకు మనశ్శాంతి లేకుండా చేశాయి. అయితే ఏదీ ఒక్క రాత్రిలోనే మారిపోదని అర్థం చేసుకున్నాను. ఆరోగ్యకరమైన ఆహారం, వర్కవుట్లపై దృష్టి సారించాను. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ నేను ఆగలేదు. నా చుట్టూ ఉన్న వాళ్లు కూడా నాకు సహాయం చేశారు. ఈ రోజు మళ్లీ అద్దంలో చూసుకున్నాను. ఎంతో అందంగా ఉన్నావని నాకు నేను చెప్పుకున్నా` అంటూ అవిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. Updated Date - 2020-10-30T15:11:45+05:30 IST