ఏటీటీ మంచి వేదిక అవుతుంది

ABN , First Publish Date - 2020-07-12T05:04:05+05:30 IST

కేతన్‌, ప్రాచీ సర్కార్‌ జంటగా బి.ఎ్‌స.ఆర్‌ దర్శకనిర్మాతగా రూపొందిన చిత్రం ‘అమ్మడు లెట్స్‌ డు కుమ్ముడు’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ఏటీటీ ద్వారా విడుదల కానుంది...

ఏటీటీ మంచి వేదిక అవుతుంది

కేతన్‌, ప్రాచీ సర్కార్‌ జంటగా బి.ఎ్‌స.ఆర్‌ దర్శకనిర్మాతగా రూపొందిన చిత్రం ‘అమ్మడు లెట్స్‌ డు కుమ్ముడు’.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ఏటీటీ ద్వారా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘నటుడిగా ఐదు సినిమాల్లో నటించి, దర్శకనిర్మాతగా మారాను. ప్రేమకథతో ఈ   సినిమా తీశా. నేను అనుకున్న థియేటర్లు దొరకక, రిలీజ్‌ చేస్తే డబ్బు తిరిగి వస్తుందా లేదా అన్న అనుమానంతో  విడుదల చేయలేదు. రామ్‌గోపాల్‌ వర్మ ‘క్లైమాక్స్‌’, ‘నేక్డ్‌’ చిత్రాలను ఎటీటీలో విడుదల చేయడం చూసి ఆ స్ఫూర్తితో నేను అలాగే విడుదల చేయాలనుకున్నా. రామసత్యనారాయణగారి ఎటీటీ ద్వారా ఈ ఆదివారం మా సినిమా విడుదల చేస్తున్నాం. చిన్న చిత్రాలకు ఇది సరైన వేదిక. భవిష్యత్తులో ఇదే పద్ధతి అభివృద్ధి చెందుతుందని నా నమ్మకం’’ అని అన్నారు.


Updated Date - 2020-07-12T05:04:05+05:30 IST