ఒకే సమయంలో... మూడు పనులూ!

ABN , First Publish Date - 2020-07-19T05:06:23+05:30 IST

వర్షాలు ప్రతి విషయంలో మేలు చేస్తాయని కథానాయిక తమన్నా చెబుతున్నారు. ఇంతకీ, ఇప్పుడు వర్షం వల్ల ఆమెకు జరిగిన మేలు ఏంటో తెలుసా? వ్యాయామ సమయాన్ని మరింత...

ఒకే సమయంలో... మూడు పనులూ!

వర్షాలు ప్రతి విషయంలో మేలు చేస్తాయని కథానాయిక తమన్నా చెబుతున్నారు. ఇంతకీ, ఇప్పుడు వర్షం వల్ల ఆమెకు జరిగిన మేలు ఏంటో తెలుసా? వ్యాయామ సమయాన్ని మరింత సంతోషకరంగా వర్షం మార్చిందట! ప్రస్తుతం తమన్నా ముంబైలో ఉన్నారు. అపార్ట్‌మెంట్‌ బయటకు అడుగు పెట్టడం లేదు. ఇంటిలో లేదా ఇంటి ఆవరణలోనే ప్రతిరోజూ వ్యాయామం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం తమన్నా వ్యాయమం చేస్తున్న సమయంలో వర్షం పడింది. వర్షంలో తడుస్తూ ఫొటో తీసుకుని సామాజిక మాధ్యమాలలో ప్రేక్షకులతో పంచుకున్నారామె. ‘‘వ్యాయమం, థెరపీ, షవర్‌ స్నానం... అన్నీ ఒకే సమయంలో జరిగాయి. ముంబై రుతుపవనాలు నా వ్యాయామాన్ని మరింత ఆనందంగా మార్చాయి. ప్రతిరోజూ వ్యాయమం చేయండి. మరువద్దు’’ అని తమన్నా పేర్కొన్నారు. సినిమాల విషయానికి వస్తే... గోపీచంద్‌ సరసన ‘సీటీమార్‌’లో కబడ్డీ కోచ్‌గా ఆమె నటిస్తున్నారు. చిరంజీవి ‘ఆచార్య’లో ఓ ప్రత్యేక గీతంలో సందడి చేయనున్నారని గుసగుస.

Updated Date - 2020-07-19T05:06:23+05:30 IST