చిన్ననాటి ఫొటో షేర్ చేసిన ఆశా భోంస్లే!

ABN , First Publish Date - 2020-09-29T18:13:02+05:30 IST

గాన కోకిల లతా మంగేష్కర్ జన్మదినోత్సవం సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

చిన్ననాటి ఫొటో షేర్ చేసిన ఆశా భోంస్లే!

గాన కోకిల లతా మంగేష్కర్ జన్మదినోత్సవం సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. లత సోమవారం 91వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా లతకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 


అలాగే లత సోదరి, ప్రముఖ గాయని ఆశా భోంస్లే తమ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. చిన్నప్పుడు అందరూ కలిసి తీయించుకున్న ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. `91వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న లతా దీదీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఫొటో ద్వారా మరోసారి బాల్య జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటున్నా. ఎడమ వైపు కుర్చీలో కూర్చున్న వ్యక్తి లతా దీదీ. ఆమె వెనకాల నేను, మీనా నిల్చున్నాం` అని ఆశా ట్వీట్ చేశారు. 
Updated Date - 2020-09-29T18:13:02+05:30 IST