ముత్తయ్య మురళీధరన్ భార్యగా?
ABN , First Publish Date - 2020-10-12T07:06:24+05:30 IST
శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పాత్రలో విజయ్ సేతుపతి నటించనున్న బయోపిక్ ‘800’...

శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పాత్రలో విజయ్ సేతుపతి నటించనున్న బయోపిక్ ‘800’. ఎమ్మెస్ శ్రీపతి దర్శకత్వం వహించనున్నారు. విజయ్ సేతుపతి నటించనున్న విషయాన్ని నిర్మాణ సంస్థ మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ అధికారికంగా తెలిపింది. ఈ చిత్రంలో ముత్తయ్య మురళీధరన్ భార్య మధిమలర్ పాత్రలో రజిష విజయన్ నటించనున్నారని సమాచారం. కొన్ని మలయాళ చిత్రాల్లో ఆమె కథానాయికగా నటించారు. ప్రస్తుతం ధనుష్ సరసన ఓ తమిళ చిత్రం చేస్తున్నారు. మంగళవారం ‘800’ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారని
చెన్నై టాక్.