పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా..

ABN , First Publish Date - 2020-12-27T11:03:27+05:30 IST

హీరో నవీన్‌చంద్ర పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ రంజిత్‌గా నటిస్తున్న ‘అర్ధ శతాబ్దం’ చిత్రం లుక్‌ను విడుదల చేశారు. కార్తిక్‌ రత్నం, కృష్ణప్రియ

పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా..

హీరో నవీన్‌చంద్ర పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ రంజిత్‌గా నటిస్తున్న ‘అర్ధ శతాబ్దం’ చిత్రం లుక్‌ను విడుదల చేశారు. కార్తిక్‌ రత్నం, కృష్ణప్రియ జంటగా నటించిన ఈ చిత్రాన్ని రవీంద్ర పుల్లే దర్శకత్వంలో చిట్టి కిరణ్‌ రామోజు నిర్మించారు. సాయికుమార్‌, ఆమని, అజయ్‌, పవిత్రా లోకేశ్‌, శరణ్య ఇతర ముఖ్య తారాగణం. ‘చిత్రనిర్మాణం పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరిలో టీజర్‌ రిలీజ్‌ చేస్తాం. అందరినీ ఆలోచింపజేసే విధంగా చిత్రం ఉంటుంది’ అని నిర్మాత తెలిపారు.

Updated Date - 2020-12-27T11:03:27+05:30 IST