హాకీ క్రీడాకారుడిగా...

ABN , First Publish Date - 2020-12-30T06:07:24+05:30 IST

కొత్త చిత్రం ‘థ్యాంక్యూ’లో అక్కినేని నాగచైతన్య హాకీ క్రీడాకారుడిగా కనిపించనున్నారని తెలుస్తోంది. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న...

హాకీ క్రీడాకారుడిగా...

కొత్త చిత్రం ‘థ్యాంక్యూ’లో అక్కినేని నాగచైతన్య హాకీ క్రీడాకారుడిగా కనిపించనున్నారని తెలుస్తోంది. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా క్రీడా నేపథ్య చిత్రం కాదు. అయితే, కొన్ని సన్నివేశాల్లో చైతన్య హాకీ క్రీడాకారుడిగా కనిపించనున్నారు. అందుకని, ఆయన హాకీలో శిక్షణ తీసుకున్నారని యూనిట్‌ వర్గాల ద్వారా తెలిసింది. హాకీ నేపథ్యంలో సన్నివేశాలను గత వారం చిత్రీకరించారట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బీవీఎస్‌ రవి కథ అందించారు. 

Updated Date - 2020-12-30T06:07:24+05:30 IST