జిమ్‌లో జంటగా...

ABN , First Publish Date - 2020-11-03T10:18:53+05:30 IST

ఫిట్‌నెస్‌కి ప్రాముఖ్యం ఇచ్చే హీరోల్లో అల్లు అర్జున్‌ ఒకరు. ఆయన సతీమణి స్నేహ సైతం అంతే! ప్రతిరోజూ వ్యాయామం చేస్తుంటారు....

జిమ్‌లో జంటగా...

ఫిట్‌నెస్‌కి ప్రాముఖ్యం ఇచ్చే హీరోల్లో అల్లు అర్జున్‌ ఒకరు. ఆయన సతీమణి స్నేహ సైతం అంతే! ప్రతిరోజూ వ్యాయామం చేస్తుంటారు. జిమ్‌లో సోమవారం వీళ్ళిద్దరూ ఒకే సమయంలో వ్యాయామాలు చేశారు. భార్యాభర్తలు జంటగా జిమ్‌ చేయడం సహజమే. అందులో ఆశ్చర్యపోవాల్సిన అంశమేమీ లేదు. అయితే... ఓ ఆసక్తికరమైన అంశం ఉంది. అదేంటంటే... ఇద్దరూ నలుపు రంగు దుస్తులు ధరించి జిమ్‌ చేశారు. ‘ట్విన్నింగ్‌ విత్‌ ద హజ్బెండ్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో జిమ్‌లో తీసుకున్న ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో స్నేహ పోస్ట్‌ చేశారు. హ్యాష్‌ట్యాగ్‌కి లవ్‌ ఎమోజీ జత చేశారామె. అలాగే, ఫొటోలో భర్తపై ప్రేమను కురిపించేలా లవ్‌ సింబల్‌ ఉంచారు. సినిమాల విషయానికి వస్తే... సుకుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్న ‘పుష్ప’లో సరికొత్త శారీరాకృతిలో కనిపించడం కోసం అల్లు అర్జున్‌ కష్టపడుతున్నారు. ఆ సినిమా కోసం హెయిర్‌ స్టయిల్‌ మార్చిన సంగతి తెలిసిందే.

Updated Date - 2020-11-03T10:18:53+05:30 IST