`ఫూల్` అంటూ మలైకాకు అర్జున్ విషెస్!

ABN , First Publish Date - 2020-10-23T21:43:16+05:30 IST

బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తన కంటే 13 సంవత్సరాలు పెద్దదైన నటి మలైకా అరోరాతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే

`ఫూల్` అంటూ మలైకాకు అర్జున్ విషెస్!

బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తన కంటే 13 సంవత్సరాలు పెద్దదైన నటి మలైకా అరోరాతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్టు సమాచారం. 


ఈ రోజు (శుక్రవారం) 48వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న మలైకాకు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విషెస్ తెలియజేశాడు. మలైకాను `ఫూల్` అని పేర్కొంటూ `హ్యాపీ బర్త్ డే మై ఫూల్ మలైకా అరోరా` అని కామెంట్ చేశాడు. నైట్ డ్రెస్‌లో ఉన్న మలైకా ఫొటోను షేర్ చేశాడు. అర్జున్ పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  Updated Date - 2020-10-23T21:43:16+05:30 IST

Read more