‘భీష్మ’లో చిన్న భాగమైనందుకు గర్వంగా ఉంది: అప్పాజీ అంబరీష

ABN , First Publish Date - 2020-02-26T18:13:08+05:30 IST

ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘భీష్మ’ చిత్రంలో చిన్న పాత్రలో నటించినందుకు ఎంతో గర్వంగా ఉందని అంటున్నారు నటుడు అప్పాజీ

‘భీష్మ’లో చిన్న భాగమైనందుకు గర్వంగా ఉంది: అప్పాజీ అంబరీష

ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘భీష్మ’ చిత్రంలో చిన్న పాత్రలో నటించినందుకు ఎంతో గర్వంగా ఉందని అంటున్నారు నటుడు అప్పాజీ అంబరీష. మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, గద్దలకొండ గణేష్ వంటి బ్లాక్ బస్టర్స్‌లో ముఖ్యపాత్రలలో నటించిన అప్పాజీ.. తను ఓ చిన్న పాత్ర పోషించిన ‘భీష్మ’ భారీ విజయం సాధించే దిశగా దూసుకుపోతుండడం సంతోషాన్నిస్తోందని అంటున్నారు. ఈ చిత్రంలో తనకు అవకాశం ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత నాగదేవర సూర్యవంశీ, కో-డైరెక్టర్ శ్రీవాస్తవ్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 


అప్పాజీ ప్రస్తుతం ‘డర్టీ హరి, విఠల్‌వాడి, నాట్యం, కాదల్, తాగితే తందానా, అభిలాష, నేడే విడుదల’ చిత్రాలతో పాటు పేరు పెట్టని మరికొన్ని చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుహాసిని, భానుప్రియ, తులసి, సురేఖా వాణి, మిర్చి మాధవి, కల్పలత, జయశ్రీ రాచకొండ వంటి ప్రముఖ నటీమణులకు జంటగా నటిస్తున్నారు. అలాగే ప్రేక్షక లోకం అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ‘కె.జి.ఎఫ్-చాప్టర్2’లో ఆయన తన పాత్ర తాలుకూ షూటింగ్‌ను ముగించుకున్నారు.

Updated Date - 2020-02-26T18:13:08+05:30 IST