నెటిజన్ అసభ్యకర కామెంట్.. హీరోయిన్ ఘాటు రియాక్షన్!
ABN , First Publish Date - 2020-06-12T17:09:28+05:30 IST
సోషల్ మీడియా ద్వారా తనపై అసభ్యకర కామెంట్ చేసిన ఓ వ్యక్తికి మలయాళ హీరోయిన్ అపర్ణా నాయర్ ఘాటు కౌంటర్ ఇచ్చింది.

సోషల్ మీడియా ద్వారా తనపై అసభ్యకర కామెంట్ చేసిన ఓ వ్యక్తికి మలయాళ హీరోయిన్ అపర్ణా నాయర్ ఘాటు కౌంటర్ ఇచ్చింది. అతని ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను, ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది. తన కెరీర్ గురించి అపర్ణా నాయర్ తన ఫేస్‌బుక్ పేజీలో ఇటీవల ఓ కామెంట్ పెట్టింది.
దీనిపై స్పందించిన ఓ నెటిజన్ `ఐ లవ్యూ` అంటూ ఆమె ప్రైవేట్ పార్ట్స్ గురించి అసభ్యకర కామెంట్ చేశాడు. దీంతో అపర్ణకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అతనికి గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. `ఒకవేళ నేను ఇలాంటి కామెంట్స్‌పై స్పందించకపోతే మీరు మరోలా అర్థం చేసుకునే అవకాశం ఉంది. డియర్ అజిత్ కుమార్.. మీ ప్రొఫైల్ చూస్తే మీకూ ఒక కూతురు ఉందని అర్థమైంది. మీరు మీ కుమార్తెను ప్రేమగా ఆలింగనం చేసుకున్న ఫొటోను చూశాను. అదే విధంగా నేను కూడా ఓ తండ్రికి కూతుర్నే. ఇలాంటి అసభ్యకర కామెంట్స్ పెట్టే ముందు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి` అని ఘాటుగా స్పందించింది.