ఏపీ సీఎం కలుద్దామన్నారు
ABN , First Publish Date - 2020-05-25T08:51:10+05:30 IST
‘‘చిత్ర పరిశ్రమకు మేలు కలిగే నిర్ణయాలతో పాటు సింగిల్ విండో అనుమతుల జీవో విడుదల చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి పరిశ్రమ తరఫున ఫోనులో కృతజ్ఞతలు తెలియజేశాను’’ అని చిరంజీవి అన్నారు...

‘‘చిత్ర పరిశ్రమకు మేలు కలిగే నిర్ణయాలతో పాటు సింగిల్ విండో అనుమతుల జీవో విడుదల చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి పరిశ్రమ తరఫున ఫోనులో కృతజ్ఞతలు తెలియజేశాను’’ అని చిరంజీవి అన్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రితో చిత్ర పరిశ్రమ ప్రముఖులు సమావేశమై, షూటింగులకు అనుమతులు సహా పలు సమస్యలపై చర్చించిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని సైతం కలుస్తామని చిరంజీవి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘లాక్‌డౌన్ ముగిసిన తర్వాత పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు కలుద్దామని జగన్‌గారు చెప్పారు. పరిశ్రమలో అన్ని విభాగాల ప్రతినిధులతో త్వరలోనే వారిని కలుస్తాం’’ అన్నారు.