జీవితం విలువేంటో తెలిసింది: అనుష్క శర్మ

ABN , First Publish Date - 2020-04-02T15:29:44+05:30 IST

కరోనా మహమ్మారి తనకు చాలా పాఠాలు నేర్పిందని, జీవితంలో విలువైనవేంటో తెలియజేసిందని బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పేర్కొంది.

జీవితం విలువేంటో తెలిసింది: అనుష్క శర్మ

కరోనా మహమ్మారి తనకు చాలా పాఠాలు నేర్పిందని, జీవితంలో విలువైనవేంటో తెలియజేసిందని బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పేర్కొంది. ఎల్లప్పుడూ బిజీగా ఉండే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా తమ ఇంట్లో ప్రశాంతంగా సమయం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో అనుష్క సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.


`కాలాన్ని గౌరవిస్తే అది మరింత వెలుగును పంచుతుంది. జీవితంలో నిజంగా ముఖ్యమైనవేంటో మనకు అర్థమయ్యేలా చేసింది. తినడానికి తిండి, తాగడానికి నీరు, తలపైన ఓ కప్పు (ఇల్లు) , కుటుంబ సభ్యుల ఆరోగ్యం.. ఇవి కాకుండా జీవితంలో ఉన్నవన్నీ బోనస్. ఈ ప్రాథమిక అవసరాలు కూడా తీరకుండా ఎంతో మంది బాధలు పడుతున్నారు. అలాంటి వారి కోసం నేను దేవుణ్ని ప్రార్థిస్తున్నా` అంటూ అనుష్క పేర్కొంది.  

Updated Date - 2020-04-02T15:29:44+05:30 IST