లూడో ఆటలో అనుష్క ఫామిలీ బిజీ

ABN , First Publish Date - 2020-04-20T13:23:01+05:30 IST

దేశంలో కొనసాగుతున్న లొక్డౌన్లో షూటింగ్ లు షట్డౌన్ అయిన కారణంగా సినీ తారలు వారి ఇళ్ళ వద్ద కాలం గడుపుతున్నారు. ఈ సమయంలో...

లూడో ఆటలో అనుష్క ఫామిలీ బిజీ

దేశంలో కొనసాగుతున్న లొక్డౌన్లో షూటింగ్ లు షట్డౌన్ అయిన కారణంగా సినీ తారలు వారి ఇళ్ళ వద్ద కాలం గడుపుతున్నారు. ఈ సమయంలో వారు టైమ్‌పాస్ చేయడానికి, సోషల్ మీడియాలో తమ సమాచారాన్ని పంచుకోవడానికి ఏదో ఒకటి చేస్తున్నారు. బాలీవుడ్ నటి అనుష్క శర్మ, ఆమె భర్త, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ లాక్డౌన్ సమయాన్ని ఉల్లాసంగా గడుపుతున్నారు. అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్క్రీన్ షాట్‌ను పంచుకున్నారు, దీనిలో విరాట్ కోహ్లీ, తల్లిదండ్రులతో కలిసి లూడో ఆడుతోంది. ఈ ఆటలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తల్లిదండ్రులు అనుష్క  కంటే ముందున్నారని స్క్రీన్ షాట్ లో స్పష్టంగా కనిపిస్తోంది. అనుష్క శర్మ తన ఓటమిని సరదాగా అంగీకరించి, 'నేను వదులుకోవడం లేదు. నేను ఇంట్లోనే ఉండి సామాజిక దూరం పాటిస్తున్నాను అని రాసింది. కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అనుష్క శర్మ,  విరాట్ కోహ్లీ ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్, ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ (మహారాష్ట్ర) కు సహాయం అందించారు. 

Updated Date - 2020-04-20T13:23:01+05:30 IST