ప్రభాస్‌తో పెళ్లిపీటలపై ఉన్న పిక్‌పై అనుష్క రియాక్షన్‌ ఇదే

ABN , First Publish Date - 2020-10-05T02:25:47+05:30 IST

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, అనుష్కల గురించి ఆ మధ్య ఎటువంటి వార్తలు వినిపించాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వారిద్దరూ కలిసి

ప్రభాస్‌తో పెళ్లిపీటలపై ఉన్న పిక్‌పై అనుష్క రియాక్షన్‌ ఇదే

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, స్వీటీ అనుష్కల గురించి ఆ మధ్య ఎటువంటి వార్తలు వినిపించాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వారిద్దరూ కలిసి చేసిన 'మిర్చి' చిత్రంలోని పెళ్లిపీటలపై కూర్చున్న పిక్‌ను సోషల్‌ మీడియాలో షేర్ చేస్తూ.. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని ఒకసారి, వారిద్దరికీ పెళ్లి అయిపోయిందని మరోసారి.. ఇలా వార్తలు రావడం.. ప్రతిసారీ వాటిని వీరిద్దరూ ఖండిస్తూ రావడం వంటి విషయాలు తెలిసిందే. అయితే ఇటీవల ట్విట్టర్‌లోకి అధికారికంగా అడుగుపెట్టిన అనుష్క ఫస్ట్ టైమ్‌ ఆదివారం తన అభిమానులతో చిట్‌ చాట్‌ చేశారు. ఈ చిట్‌ చాట్‌లో ఓ నెటిజన్‌.. 'మిర్చి' చిత్రంలోని పెళ్లిపీటలపై కూర్చుని ఉన్న పిక్‌పై స్పందించాలంటూ కోరటంతో.. అనుష్క  ఆ ఫొటోపై ఆసక్తికరమైన సమాధానమిచ్చారు.


''అపురూపమైన ఫొటో.  మిర్చి చిత్ర షూటింగ్‌లో సన్నివేశం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ అందమైన ఫొటో తీయబడింది. మిర్చి నా హృదయానికి చేరువైన చిత్రం. యూవీ క్రియేషన్స్ వారి మొదటి చిత్రం. ప్రమోద్‌, వంశీ, విక్కి మంచి హృదయం ఉన్న నిర్మాతలు.." అని అనుష్క తెలిపింది. Updated Date - 2020-10-05T02:25:47+05:30 IST

Read more