‘ఆదిపురుష్‌’ సీత పాత్రపై అనుష్క ఏమందంటే..

ABN , First Publish Date - 2020-09-29T21:54:45+05:30 IST

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, ఓం రౌత్‌ దర్శకత్వంలో త్వరలో సెట్స్‌ పైకి వెళ్లనున్న చిత్రం 'ఆదిపురుష్‌'. విలన్‌గా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో

‘ఆదిపురుష్‌’ సీత పాత్రపై అనుష్క ఏమందంటే..

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌,  ఓం రౌత్‌ దర్శకత్వంలో త్వరలో సెట్స్‌ పైకి వెళ్లనున్న చిత్రం 'ఆదిపురుష్‌'. విలన్‌గా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో సీత పాత్ర విషయంలో ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కీర్తి సురేష్‌, కియారా అద్వానీ, ప్రియాంకా చోప్రా, అనుష్క శర్మ వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అలాగే ప్రభాస్‌ అనగానే ఎక్కువగా వినిపించే పేరు అనుష్క. ఆమె పేరు కూడా సీత పాత్ర లిస్ట్‌లో వినిపించింది. అయితే 'ఆదిపురుష్‌' సీత పాత్రపై తాజాగా అనుష్క స్పందించారు. 


ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'నిశ్శబ్దం'. ఈ చిత్రం అక్టోబర్‌ 2న ఓటీటీలో విడుదల కాబోతోన్న సందర్భంగా మీడియాతో అనుష్క ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె 'ఆదిపురుష్'లోని సీత పాత్రపై వివరణ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ''నాకు అటువంటి ఆఫర్‌ ఏమీ రాలేదు. నేను ఆ చిత్రంలో నటించడం లేదు. వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదు.." అని అనుష్క తెలిపారు.

Updated Date - 2020-09-29T21:54:45+05:30 IST