ఇంకా గాళ్‌ ఇబ్బందులు పడుతూనే ఉంది: అనుష్క

ABN , First Publish Date - 2020-10-12T03:15:22+05:30 IST

ఆడపిల్లంటే కొందరికి అదృష్టం - మరికొందరి దృష్టిలో దురదృష్టం. ఈ బేధాలను చెరిపేసి ఆడపిల్లంటే ఒక వరం అని చాటడానికి వెలసిన రోజు ఇంటర్నేషనల్

ఇంకా గాళ్‌ ఇబ్బందులు పడుతూనే ఉంది: అనుష్క

ఆడపిల్లంటే కొందరికి అదృష్టం - మరికొందరి దృష్టిలో దురదృష్టం. ఈ బేధాలను చెరిపేసి ఆడపిల్లంటే ఒక వరం అని చాటడానికి వెలసిన రోజు ఇంటర్నేషనల్ డే ఫర్ గాళ్ చైల్డ్. ఆరోజునైనా అమ్మాయిలను ఆదరించి గౌరవించే బాటలో నడుద్దాం. అక్టోబర్ 11న ఇంటర్నేషనల్ డే ఫర్ గాళ్ చైల్డ్ సందర్భంగా గాళ్‌ చైల్డ్ గొప్పతనాన్ని చెబుతూ సెలబ్రిటీలెందరో సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారు. ప్రపంచానికి వెలుగునిచ్చే మహిళ.. తను వెలుగులోకి రావడానికి ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉందని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు స్వీటీ అనుష్క. 


ఇన్‌స్టాగ్రమ్‌ ద్వారా ఇంటర్నేషనల్ డే ఫర్ గాళ్ చైల్డ్ విశెష్‌ చెప్పిన అనుష్క.. ''ఈ ప్రపంచానికి వెలుగుని చూపించే తను వెలుగులోకి రావడానికి ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉంది. మన దేశానికి స్ఫూర్తి బాలికలే అని ఇప్పటికైనా గుర్తిద్దాం. అమ్మాయిలు వారి గళం వినిపించడానికి, వారి హక్కులు సాధించుకోవడానికి చేయూతనిద్దాం.." అని తెలిపారు.Updated Date - 2020-10-12T03:15:22+05:30 IST

Read more