ట్విటర్‌లోకి అనుష్క!

ABN , First Publish Date - 2020-10-01T03:27:15+05:30 IST

ప్రస్తుతం సినీ ప్రముఖులందరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు.

ట్విటర్‌లోకి అనుష్క!

ప్రస్తుతం సినీ ప్రముఖులందరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. తాము చెప్పాలనుకున్నవాటిని నేరుగా అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే ప్రముఖ హీరోయిన్ అనుష్క మాత్రం సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నప్పటికీ అప్పుడప్పుడు మాత్రమే అప్‌డేట్ ఇస్తుంటుంది. 


ట్విటర్‌కు ఇప్పటివరకు దూరంగా ఉంటూ వచ్చింది. అయితే తాజాగా ట్విటర్ అకౌంట్‌ను కూడా ప్రారంభించింది. @MsAnushkaShetty పేరుతో అకౌంట్‌ను ఓపెన్ చేసింది. `హాయ్.. అందరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నా. నా నుంచి ఆసక్తికర అప్‌డేట్‌ల కోసం నా అధికారిక ట్విటర్ ఖాతా @MsAnushkaShettyను పాలో అవండ`ని ట్వీట్ చేసింది. 

 Updated Date - 2020-10-01T03:27:15+05:30 IST