పెళ్లి, పిల్లలపై అనుష్క స్పందన!

ABN , First Publish Date - 2020-11-03T17:09:08+05:30 IST

ప్రముఖ హీరోయిన్ అనుష్క వివాహ గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి.

పెళ్లి, పిల్లలపై అనుష్క స్పందన!

ప్రముఖ హీరోయిన్ అనుష్క వివాహం గురించి ఇప్పటికే ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. కొన్ని నెలలుగా అనుష్క పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే వుంది. అనుష్క పెళ్లిపై అందరూ ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. తన పెళ్లి గురించి అనుష్క ఇప్పటికే పలుసార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ ఆ ప్రశ్నలు ఆగడం లేదు.  


తాజాగా మరోసారి అనుష్కకు పెళ్లి గురించిన ప్రశ్న ఎదురైంది. దీనికి అనుష్క స్పందిస్తూ.. `నేను వివాహ వ్యవస్థను నమ్ముతున్నాను. పిల్లలు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఈ విషయంలో నాకు తొందర లేదు. నాకు నచ్చిన వాడు ఎదురుపడినప్పుడే వివాహం చేసుకోవాలనుకుంటున్నాన`ని అనుష్క తెలిపింది. తనకు 20 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడే తల్లిదండ్రులు పెళ్లి గురించి ఒత్తిడి చేశారని, అయితే ఇప్పుడు వారి ఆలోచనా ధోరణి మారిందని అనుష్క చెప్పింది. 

Updated Date - 2020-11-03T17:09:08+05:30 IST