ఇప్పటి కంగన నాకు తెలియదు: డైరెక్టర్ అనురాగ్

ABN , First Publish Date - 2020-12-29T14:49:00+05:30 IST

బాలీవుడ్‌లో లైంగిక వేధింపులు, బంధుప్రీతి, డ్రగ్స్ గురించి తరచుగా గళమెత్తుతూ ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ కంగనా రనౌత్.

ఇప్పటి కంగన నాకు తెలియదు: డైరెక్టర్ అనురాగ్

బాలీవుడ్‌లో లైంగిక వేధింపులు, బంధుప్రీతి, డ్రగ్స్ గురించి తరచుగా గళమెత్తుతూ ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ కంగనా రనౌత్. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులపై కూడా కంగన తరచుగా విమర్శలు చేస్తూ వివాదాస్పద నటిగా మారింది. `గ్యాంగ్‌స్టర్` సినిమాతో కంగనను బాలీవుడ్‌కు పరిచయం చేసిన దర్శకుడు అనురాగ్ బసు తాజాగా ఆమె ప్రవర్తన గురించి మాట్లాడారు. 


``గ్యాంగ్‌స్టర్` సినిమా ఆడిషన్స్ కోసం అప్పట్లో దాదాపు 25 మంది యువతులు వచ్చారు. వారిలో కంగన మాత్రమే నా పాత్రకు సెట్ అవుతుందనిపించి ఆమెను సెలెక్ట్ చేశాం. ఆమె చాలా విభిన్నమైనది. ఎలాంటి అనుమానాలున్నా వెంటనే నన్ను అడిగి తెలుసుకునేది. దేన్నైనా త్వరగా నేర్చుకుంటుంది. ఆమె మరింత ఎత్తుకు ఎదుగుతుందని ఆ సమయంలోనే నాకు అర్థమైంది. ఆ తర్వాత మేం ఎక్కువగా కలుసుకున్నది లేదు. కలిసినపుడు మాత్రం చాలా సరదాగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్న కంగన గురించి నాకేం తెలియదు. వ్యక్తిగతంగా నాకు తెలిసిన కంగన, ఇప్పటి కంగన ఒక్కరు కాదు. నాకు తెలిసి ఇద్దరు కంగనా రనౌత్‌లు ఉన్నారు. ఆ రెండో కంగన గురించి నాకేం తెలియద`ని అనురాగ్ అన్నారు. 

Updated Date - 2020-12-29T14:49:00+05:30 IST