సాయిపల్లవిని ప్రేమిస్తూనే ఉంటానన్న హీరోయిన్‌

ABN , First Publish Date - 2020-10-18T20:37:10+05:30 IST

ఒకరేమో మలయాళీ ముద్దుగుమ్మ.. మరొకరు చెన్నై సొగసరి. మంచి స్నేహితులైన వీరిద్దరూ హీరోయిన్స్‌గా దక్షిణాది సినిమాల్లో తమదైన గుర్తింపును సంపాదించుకున్నారు. వాళ్లేవరో కారు.. ఒకరేమో అనుపమా పరమేశ్వరన్‌, మరొకరు సాయిపల్లవి.

సాయిపల్లవిని ప్రేమిస్తూనే ఉంటానన్న హీరోయిన్‌

ఒకరేమో మలయాళీ ముద్దుగుమ్మ.. మరొకరు చెన్నై సొగసరి. మంచి స్నేహితులైన వీరిద్దరూ హీరోయిన్స్‌గా దక్షిణాది సినిమాల్లో తమదైన గుర్తింపును సంపాదించుకున్నారు. వాళ్లేవరో కారు.. ఒకరేమో అనుపమా పరమేశ్వరన్‌, మరొకరు సాయిపల్లవి. రీసెంట్‌గా షూటింగ్స్‌ నుండి దొరికిన తీరిక సమయంలో ఇద్దరూ కలుసుకున్నారు. ఈ క్యూటీస్‌ దిగిన లేటెస్ట్‌ క్యూట్‌ ఫొటోను అనుపమా పరమేశ్వరన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. "మేరీ మరియు మలర్‌ మీకు గుర్తున్నారా(సినిమాలో అనుపమ, సాయిపల్లవి క్యారెక్ట్స్‌ పేర్లు). ఐలవ్‌ యు సాయిపల్లవి. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నీకు నేను ఎప్పటికీ అభిమానినే" అంటూ మెసేజ్‌ కూడా పోస్ట్‌ చేశారు. 
Updated Date - 2020-10-18T20:37:10+05:30 IST